జీపీ భవనాలు నిర్మిస్తాం | - | Sakshi
Sakshi News home page

జీపీ భవనాలు నిర్మిస్తాం

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

●

వెయ్యి కోట్ల రూపాయలతో జీపీలకు పక్కా భవనాలు మంజూరు చేశామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.

- 8లో

లోపాలు అధికం..

చర్యలు స్వల్పం!

సాక్షి ప్రతినిధి, నల్లగొండ :

నగరంలోని ఐకాన్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో అనేక లోపాలు వెలుగు చూసినప్పటికీ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. ఏకంగా 14 అంశాల్లో లోపాలు ఉన్నట్లు జిల్లా రిజిస్ట్రేషన్‌ అథారిటీ నిర్వహించిన పరిశీలనలో వెల్లడైనా కఠిన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. రాజకీయ ఒత్తిళ్లతో కఠిన చర్యలు పక్కన పెట్టి జరిమానాతోనే సరిపుచ్చినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆస్పత్రిపై అనేక ఫిర్యాదులు

వైద్యంలో లోపాలు, వైద్య పరీక్షల పేరుతో అడ్డగోలు వసూళ్లు, మరణించిన వారికి ఐసీయూలో చికిత్స పేరుతో దండుకోవడం.. ఇలా ఐకాన్‌ ఆసుపత్రిపై వైద్యారోగ్య శాఖకు పది రాతపూర్వక ఫిర్యాదులు అందాయి. దీంతో గత నెల 11వ తేదీన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాహుల్‌ ఆధ్వర్యంలోని బృందం తనిఖీ చేసింది. అనంతరం షోకాజ్‌ నోటీసులు జారీచేసి వివరణ కోరింది. ఆసుపత్రి యాజమాన్యం అరకొరగానే ఇచ్చిన వివరణ, తనిఖీ నివేదిక, ఫిర్యాదులు, ఇతర రికార్డులను పరిశీలించిన జిల్లా రిజిస్ట్రేషన్‌ అథారిటీ.. పలు తప్పిదాలను, లోపాలను, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించింది. అయితే ఇన్ని లోపాలు గుర్తించినప్పటికీ చివరకు రూ.5 లక్షల జరిమానాతోనే చర్యలను పరిమితం చేయడం చర్చకు దారితీసింది. ఉన్నత స్థాయి నుంచి వచ్చిన రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకున్నారని చర్చ సాగుతోంది. అంతేకాదు రెండు నెలల్లో లోపాలను సరిదిద్దుకోవాలంటూ అవకాశం కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆసుపత్రుల లైసెన్సింగ్‌ అథారిటీ ఆగ్రహం

ఆసుపత్రుల లైసెన్సింగ్‌ అథారిటీ ఐకాన్‌ ఆసుపత్రి వ్యవహారంలో తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. అడ్డగోలు వసూళ్లు, అవకతవకలు, ఊహించని విధంగా 191 మంది రోగుల మరణాలు, చివరి క్షణంలో ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం, రెఫరల్‌ ఆసుపత్రులకు పంపించిన రోగుల వివరాలను ఇవ్వకపోవడం వంటి పలు ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని, ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేయాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. దీంతో పెద్ద ఎత్తున పైరవీలు చేసి, రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడంతో లైసెన్స్‌ రద్దు అంశాన్ని నిలుపుదల చేసి, జరిమానాకే పరిమితమైనట్లు తెలిసింది.

తల్లిదండ్రులతో ఎయిర్‌హోస్టెస్‌ గాయం హర్షితారెడ్డి

ఐకాన్‌పై రూ.5 లక్షల జరిమానాతోనే సరిపుచ్చిన యంత్రాంగం

రాజకీయ ఒత్తిళ్లతోనే ఆస్పత్రిపై చర్యలు చేపట్టడంలో వైఫల్యం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement