నల్లగొండ : భూమి.. సమానత్వం కోసం పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా నల్లగొండలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్‌లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, చోల్లేటి ప్రభాకర్, సంజీవ, కొండూరు సత్యనారాయణ, రాములు, చెన్నయ్య, సత్తయ్య, సునీత, మురళి, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


