విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

దేవరకొండ: విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాల సాధనకు నిరంతరం శ్రమించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం కొమ్మేపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, కల్పిస్తున్న వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌తో మాడ్లాడి త్వరలోనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. తరగతి గదిలోనే విద్యార్థులు తమ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

విద్యార్థుల ఉన్నతికే గురుకులాలు

కొండమల్లేపల్లి: విద్యార్థుల ఉన్నతికే గురుకులాలు పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం ఆయన కొండమల్లేపల్లి మండలం దంజిలాల్‌తండా ఎక్స్‌ రోడ్డు వద్ద ఉన్న ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించారు. పాఠశాలలో అందుతున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం కొండమల్లేపల్లి మండలం వర్ధమానిగూడెంలోని పీల్యతండాలో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గుడితండాలో పెండ్లిపాకల రిజర్వాయర్‌ ముంపు బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవరకొండకు వెళ్లారు. ఈ కార్యక్రమాల్లో కమిషన్‌ సభ్యులు రేణిగుంట ప్రవీణ్‌, లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్‌, జిల్లా శంకర్‌, అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, దేవరకొండ సబ్‌ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్తియాన్‌ మావి, డీఎస్పీ శ్రీనివాసరావు, డీటీడీఓ కమలాకర్‌రెడ్డి, ఆర్‌సీఓ శ్రీనివాసరావు, ఏసీఎంఓ వెంకటేష్‌ నాయక్‌, ఏటీడీఏ వెంకటేశ్వర్‌, కొండమల్లేపల్లి ఎంపీడీఓ స్వర్ణలత, తహసీల్దార్‌ నరేందర్‌, ఎంఈఓ ఆర్‌.నాగేశ్వర్‌రావు నాయక్‌, ఎంపీఓ సుధీర్‌కుమార్‌, సర్పంచులు, ప్రిన్సిపాల్‌ శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement