రైతుల ఆదాయం పెరిగేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల ఆదాయం పెరిగేలా చూడాలి

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

నల్లగొండ: రైతుల ఆదాయం పెరిగేలా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేయించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార శాఖల కార్యదర్శి కె.సురేంద్రమోహన్‌ అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండ కలెక్టరేట్‌లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రైతులు సబ్సిడీ పథకాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్స్‌ ఐడీ కచ్చితం చేసినందున యుద్ధ ప్రాతిపదికన నెల రోజుల్లో ఫార్మర్స్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇతర గోదాముల సామర్థ్యాన్ని పెంచాలని, రైతులందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇప్పించాలని తెలిపారు. రైతు ఉత్పాదక సంస్థలను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో 80 ఎఫ్‌పీఓలు ఉండగా, రూ.3,120 కోట్ల ఎగుమతి వ్యాపారం జరగుతుందని, దాన్ని రూ.5000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని శాస్త్రబద్ధంగా, బాధ్యతాయుతంగా నిర్వహించేలా రైతులను చైతన్యం చేయాలన్నారు. పంట మార్పిడి, సెరికల్చర్‌, హార్టికల్చర్‌ను ప్రోత్సహించాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ ఉంచేందుకు ఎఫ్‌పీఓల ద్వారా కోల్డ్‌ స్టేజిలను పెంచాలన్నారు. త్వరలో ప్రారంభం కానున్న వానాకాలం ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్‌ చంద్రశేఖర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార శాఖల కార్యదర్శి సురేంద్రమోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement