సైబర్‌ మోసాల నివారణే ట్రాయ్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాల నివారణే ట్రాయ్‌ లక్ష్యం

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

రామగిరి(నల్లగొండ): టెలికం వినియోగదారుల హక్కులు, సేవలపై అవగాహన పెంచడంతోపాటు సైబర్‌ మోసాల నివారణే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయ సంయుక్త సలహాదారు కేవీ.సురేష్‌బాబు అన్నారు. ట్రాయ్‌) ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండలోని కాకతీయ డిగ్రీ, పీజీ కళాశాలలో టెలికం వినియోగదారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టెలికం రంగాన్ని క్రమబద్ధీకరించడంలో, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంలో ట్రాయ్‌ నిర్వహిస్తున్న పాత్రను వివరించారు. సేవల నాణ్యత, వేగాన్ని తెలుసుకునేందుకు, అవాంఛిత కాల్స్‌ను అరికట్టేందుకు ట్రాయ్‌కి చెందిన మై కాల్‌, మై స్పీడ్‌, డీఎన్‌డీ యాప్‌లను ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం వన్‌టౌన్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ కె.పరశురామ్‌ మాట్లాడుతూ ట్రాయ్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ పి.నరసింహారెడ్డి, టెలికం శాఖ (ఏపీ లైసెన్స్‌ సర్వీస్‌ ఏరియా) భద్రతా విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జి.పాపారావు, డి.ప్రదీప్‌కుమార్‌, ఎ.క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement