బీఆర్‌ఎస్‌ అక్రమాలకు కేరాఫ్‌ థర్మల్‌ ప్లాంట్‌ | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అక్రమాలకు కేరాఫ్‌ థర్మల్‌ ప్లాంట్‌

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

మిర్యాలగూడ : దామరచర్లలో నిర్మించిన యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ బీఆర్‌ఎస్‌ నేతల అక్రమాలకు కేరాఫ్‌గా మారిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆరోపించారు. దామరచర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ వద్ద ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వనరులు లేని దామరచర్ల మండలంలో రాజకీయ లబ్ధికోసమే పవర్‌ప్లాంట్‌ నిర్మించారని, దానికి అవసరమైన బొగ్గును 250 కి.మీ దూరం నుంచి తీసుకొస్తున్నారని విమర్శించారు. దీనికి గాను ప్రభుత్వంపై ఏటా రూ.40వేల కోట్ల భారం పడుతోందన్నారు. ఏ మొఖం పెట్టుకొని బీఆర్‌ఎస్‌ నేతలు పవర్‌ప్లాంట్‌ను సందర్శించారని ప్రశ్నించారు. అనేక ఇబ్బందులున్నా ప్రజాప్రభుత్వం పవర్‌ప్లాంట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయిస్తోందని, సాంకేతిక కారణంగా ఒక యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోతే దాన్ని బూచి చూపి ప్రజలను బీఆర్‌ఎస్‌ నేతలు రెచ్చగొట్టడం తగదన్నారు. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తమ అనుచరులకు, బంధువులకు కాంట్రాక్టుతోపాటు పరి హారం కింద కోట్ల రూపాయలు ఇప్పించి అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. నాడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్‌లో చూపిన ఆస్తులెన్ని తొమ్మిదినరేళ్ల పాలనలో మీరు సంపాదించిన ఆస్తులెన్నో తేల్చుకుందామని సవాలు విసిరారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, నూకల వేణుగోపాల్‌రెడ్డి, గాయం ఉపేందర్‌రెడ్డి, పొదిల శ్రీనివాస్‌, సర్పంచ్‌లు రేణుకశ్రీ, శ్రావణి, పోకల వెంకటేశ్వర్లు, నాయకులు స్కైలాబ్‌నాయక్‌, ఇంద్రకుమార్‌, మోయిజ్‌, బాలునాయక్‌, టి.సైదులు తదితరులు పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement