స్వచ్ఛత సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛత సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

నల్లగొండ : స్వచ్ఛత సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ఎఫ్‌సీఐ నల్లగొండ డివిజన్‌ మేనేజర్‌ సువీన్‌కుమార్‌ అన్నారు. ఆయన గురువారం నల్లగొండలో స్వచ్ఛతా హి సేవ–2026లో భాగంగా ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా జ్ఞానయాత్రలో పాల్గొని మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి–పొడి చెత్తగా వేరు చేసి సిబ్బందికి అందించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అలవాట్లను చిన్ననాటి నుంచే అలవరచుకోవాలని సూచించారు. విద్యార్థులు స్వచ్ఛత దూతలుగా మారి పరిశుభ్రత ప్రాముఖ్యతను ఇతరులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలె వెంకటయ్య, ఎఫ్‌సీఐ సీనియర్‌ అధికారులు పవన్‌, ఆదిమల్ల శంకర్‌, కాశిరెడ్డి , ధీరజ్‌, ఉద్యోగులు షాహిద్‌, ప్రవీణ్‌, యమున, మమత, దివ్య, క్రాంతి, అజయ్‌, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement