చివరి వరకు అప్రమత్తతే ప్రధానం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

చివరి వరకు అప్రమత్తతే ప్రధానం : ఎస్పీ

Sep 24 2026 2:18 AM | Updated on Sep 24 2026 2:18 AM

వేములపల్లి : నిమజ్జనం చివరి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అన్నారు. బుధవారం వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్‌ ఎడమ కాల్వ వద్ద ఏర్పాటు చేసిన గణేష్‌ నిమజ్జన కేంద్రాన్ని డీఎస్పీ రవితో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతకుముందు జిల్లా అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ నిమజ్జన ప్రదేశాన్ని ఆర్డీఓ రమణారెడ్డితో కలిసి పరిశీలించారు. వీరివెంట మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్‌రావు, తహసీల్దార్‌ హేమలత, ఎంపీడీఓ జ్యోతి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీజారెడ్డి, సీఐ పీఎన్‌డీ ప్రసాద్‌, విద్యుత్‌ ఏడీ ఇందిరా, వేములపల్లి ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లు, ఏఈ నాగరాజు, వైద్యాధికారి డాక్టర్‌ సుచరిత, ఆర్‌ఐ స్పందన, సర్పంచ్‌ పుట్టల సందీప్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement