కనగల్ : తపంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం కనగల్ మండలం తేలకంటిగూడెం గ్రామంలో పంటలు ఎండిన రైతులు భైరగోని పెద్ద లింగయ్య, యాదయ్య పరామర్శించి ధైర్యం చెప్పా రు. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్‌లో విద్యుత్ సరఫరా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాజ లాలు అందుబాటులో ఉన్నా పంటలు ఎందుకు ఎండిపోతున్నాయో ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 21 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
విద్యుత్ ఉత్పత్తి ఎందుకు నిలిపివేశారు
యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను ఎందుకు నిలిపివేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. నీళ్లు, బొగ్గు లేదని చెబుతూ విద్యుత్, సాగునీటి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతులకు సాగునీరు, 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లి కార్జున్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, గోన రవీందర్‌రావు, మాజీ జెడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, పార్టీ నాయకులు అయితగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి


