నల్లగొండ టౌన్ : కంప్యూటర్ విద్యతోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని టీజీఎంఎస్‌సీ, సీసీసీ డైరెక్టర్ తారిఖ్ అన్వర్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని బహదూర్ ఖాన్ మందిరంలో విద్యార్థులుకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. అనంతరం హైదరాబాద్ ఫుల్ స్టాక్ అకాడమీ డైరెక్టర్ ఐజాజ్ అహ్మద్, విద్యావేత్త లతీఫ్ మాట్లాడుతూ కంప్యూటర్ పరిజ్ఞానం, కృత్రిమ మేధ, ఉపాధి ఆధారిత కోర్సులు, ఉద్యోగ అవకాశాలపై వివరించారు. తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ (హైదరాబాద్), ఇదారా–ఏ–ఇకామత్ ఖానా బహదూర్ ఖాన్ (నల్లగొండ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ అదనపు కార్యక్రమ సంచాలకురాలు డాక్టర్ సారా సుత్తారి, మైనారిటీ సంక్షేమ శాఖ మాజీ సంచాలకుడు ఎంజే.అక్బర్, సెట్‌విన్ జిల్లా సమన్వయకర్త కొండపల్లి రేణుక, ఇదారా–ఏ–ఇకామత్ ఖానా బహదూర్ ఖాన్ అధ్యక్షుడు షాహిద్ అహ్మద్, మహమ్మద్ షఫీ నవాజ్ ఖాన్, ఖాజా ఫరీదుద్దీన్, మహమ్మద్ షఫీయుద్దీన్, ఎం.ఏ.బారీ, ముబారిజుద్దీన్ సాబేర్, జాహెద్ హుస్సేన్, ముంతాజ్ ఖురేషీ, మసీఉద్దీన్, జాఫర్, మొహితుల్లా, ఇంజినీర్ జునైద్ హష్మీ, హాఫిజ్ వ ఖారీ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


