కోదాడ : కోదాడ పట్టణంలో శనివారం నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలోని పట్టణంలోని సీసీ రెడ్డి విద్యానిలయంలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు జాబ్‌మేళా కొనసాగనుంది. అభ్యర్థులు పేర్ల నమోదుకు అధికారులు క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు. శుక్రవారం రాత్రి వరకు 50 వేల మందికి పైగా అభ్యర్థులతో పాటు 354 కంపెనీలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. శనివారం ఉదయం వరకు నమోదు చేసుకొనే అవకాశం ఉండడంతో ఈ సంఖ్య 60 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.
హాజరు కానున్న ప్రముఖులు
కోదాడలో శనివారం జరిగే మెగా జాబ్‌మేళాకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ హాజరు కానున్నట్లు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మెగా జాబ్‌మేళాలో పాల్గొనే వారందరికీ మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఈ మేరకు విద్యాలయం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని వేర్వేరు ప్రదేశాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
ట్రాఫిక్ మళ్లింపు
కోదాడలో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించను న్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను బైపాస్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నారు. ఖమ్మం క్రాస్‌రోడ్డులో దుకాణాలను మూసివేయిస్తున్నారు. జాబ్‌మేళా పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఇందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. జాబ్‌మేళా నిర్వహించే సీసీరెడ్డి విద్యానిలయాన్ని శుక్రవారం సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి ఎమ్మెల్యే పద్మావతి పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఫ 50 వేలకుపైగా అభ్యర్థులు, 354 కంపెనీలు రిజిస్టర్


