నల్లగొండ : వానాకాలం సీజన్‌లో ధాన్యం సేకరణను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్‌లో 2026–27 వానాకాలం ధాన్యం సేకరణపై అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ధాన్యం సేకరణ పూర్తిగా ప్రభుత్వ సంస్థల ద్వారా మాత్రమే నిర్వహిస్తామన్రాఉ. గోదాముల నిర్వహణ, హమాలీల నియామకం, రవాణా సౌకర్యాలను ప్రభుత్వ శాఖలే చూసుకోవాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం సన్నధాన్యంతోపాటు, 2.50 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత సీజన్‌లో తాలు, రవాణా, హమాలీ తదితర సమస్యలు ఎదురయ్యాయని ఈసారి అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అభ్యుదయ రైతు రాంరెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీసీవో మమత, పౌర సరఫరాల డీఎం రాంపతినాయక్, డీఏఓ వినోద్‌కుమార్, డీఎస్‌ఓ వెంకటేష్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


