ప్రజా ఆకాంక్షకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా ఆకాంక్షకు ప్రాధాన్యం

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

రైతులకు చేయూత

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను కొనసాగిస్తూ, సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన అమరులకు నివాళులర్పించి, జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

అమరుల త్యాగాలతో విముక్తి

సెప్టెంబర్‌ 17వ తేదీ తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని మంత్రి పేర్కొన్నారు. 1948లో ఇదే రోజున ఆపరేషన్‌ పోలో అనంతరం హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందన్నారు. సోనియాగాంధీ చొరవతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. 2014 తర్వాత పదేళ్ల పాలనను ప్రజలు చూశారని, 2023 డిసెంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. వెయ్యి రోజుల పాలనలో సంక్షేమాన్ని విస్తరించడంతోపాటు సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.

ఎంజీయూలో కొత్త కోర్సులు

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులు ప్రారంభించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో 4,862 ఇళ్ల గృహ

ప్రవేశాలు జరిగాయని వెల్లడించారు. నీటిపారుదల, ఎత్తిపోతల పథకాల కోసం జిల్లాలో 2,062.34 ఎకరాల భూసేకరణ చేసి రూ.442 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. భూభారతి పోర్టల్‌ ద్వారా జిల్లాలో 1,60,517 దరఖాస్తులు స్వీకరించగా 99.21 శాతం పరిష్కరించినట్లు మంత్రి

తెలిపారు. 40 గ్రామాల్లో భూముల రీ–సర్వే ప్రారంభమైందని, 11 గ్రామాల్లో పూర్తయిందని, 5,463.27 ఎకరాల విస్తీర్ణాన్ని సర్వే చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఫ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

ఫ రుణమాఫీతో రైతులకు లబ్ధి

ఫ మహాలక్ష్మి పథకంతో

ప్రయోజనం

ఫ ప్రజా పాలన దినోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రైతులకు చేయూతనిస్తూ రూ.2 లక్షల పంట రుణమాఫీ చేశామన్నారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 8.70 కోట్ల మందికి ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించామన్నారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం కింద 2,53,602 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరిందన్నారు. గృహజ్యోతి పథకం కింద 2,55,182 మందికి రూ.209.53 కోట్ల సబ్సిడీతో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మహిళా పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేశామని, రూ.2.50 కోట్లతో నీలగిరి మహిళా మార్ట్‌ నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. 924 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.82.88 కోట్ల రుణాలు, 2,409 గ్రూపులకు రూ.3.70 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement