నల్లగొండ టూటౌన్ : ప్రకాశం బజారులోని వస్త్రలత బజారులో నిర్మించిన చేపల మార్కెట్ దుకాణాలకు అద్దె వసూలు చేయడం లేదు. ఆ దుకాణాలకు అద్దె నిర్ణయించకపోవడంతో ఉచితంగా వ్యాపారులకు ఇచ్చారా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దానికి పక్కనే మటన్ మార్కెట్ నూతన భవనం నిర్మాణం చేపట్టి ఒక్కో దుకాణానికి నెలకు రూ.3 వేల అద్దె ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. కానీ చేపల మార్కెట్‌లోని దుకాణాలకు అద్దె వసూలు చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
రూ.అరకోటి ఆదాయం
కోల్పోయిన మున్సిపాలిటీ..
చేపల మార్కెట్‌లో నిర్మించిన ఎనిమిది దుకాణా లకు సరిపడా తాగునీటిని సైతం మున్సిపల్ కార్పొరేషన్ అందిస్తోంది. దాదాపు 16 ఏళ్లకు పైగానే వాటిల్లో చిరు వ్యాపారం చేస్తున్నారు. ఎంతో ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ ఎనిమిది దుకాణాలకు బయటి మార్కెట్ ప్రకారం అయితే అద్దె ఎక్కువగానే ఉంటుంది. మటన్ షాపుల ప్రకారం ఒక్కో దుకాణానికి నెలకు రూ.3 వేలు నిర్ణయిస్తే ఏడాదికి మొత్తం దుకాణాలకు రూ.2,88,000 వేల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన గత 16 ఏళ్ల నుంచి మున్సిపాలిటీ రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయం కోల్పోయింది. అసలే ఆదాయం సరిగా లేదని చెబుతూ ఉన్న ఆదాయ వనరులను కూడా పట్టించుకోకపోవడంతో వెనుక ఉన్న ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చేపల మార్కెట్ దుకాణాలకు అద్దె నిర్ణయించి వసూలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫ నీలగిరిలో చేపల మార్కెట్‌లో
అద్దె వసూలు చేయని యంత్రాంగం
ఫ పక్కనే ఉన్న మటన్ మార్కెట్ దుకాణాలకు రూ.3 వేలు అద్దె
ఫ ఆదాయం కోల్పోతున్న
మున్సిపల్ కార్పొరేషన్


