● జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ : తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా నల్లగొండలోని పోలీస్ పరేడ్ అన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఆయన ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి పోలీస్ పరేడ్ మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి.. జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని పేర్కొన్నారు.
కుట్టు మిషన్లకు దరఖాస్తులు
నల్లగొండ : జిల్లాలోని వెనుకబడిన తరగతుల (బీసీ) కులాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించేందుకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకం’ ప్రారంభించినట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఎ.సంజీవయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన వారు సెప్టెంబర్ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన మహిళలు tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసి.. ఆ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని గ్రామీణ ప్రాంతాల వారు సంబంధిత ఎంపీడీఓలకు, పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కమిషనర్లకు సెప్టెంబర్ 30లోగా సమర్పించాలని పేర్కొన్నారు.


