నల్లగొండ : ఎల్‌నినో దృష్ట్యా భూగర్భ జలవనరుల సద్వినియోగంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన భూగర్భ జల వనరుల అంచనా జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భూగర్భ జలా లు క్లిష్టమైన పరిస్థితులున్న ప్రాంతాలు, ఎక్కువ వినియోగం ఉన్న మండలాల్లో తక్షణమే నీటి సంరక్షణ చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంస్థల్లో వాన నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం భూగర్భ జల వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతికుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితిని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, ఆర్డీవోలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ చంద్రశేఖర్


