నీలగిరికి జాతీయ అవార్డు | - | Sakshi
Sakshi News home page

నీలగిరికి జాతీయ అవార్డు

Sep 8 2026 1:59 AM | Updated on Sep 8 2026 1:59 AM

నల్లగొండ టూటౌన్‌ : నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌సీఏపీ)లో భాగంగా నిర్వహించిన వార్డు స్థాయి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌ –2026లో నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. దేశ వ్యాప్తంగా 130 మున్సిపాలిటీలు పాల్గొనగా నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని 16వ వార్డు (డివిజన్‌) కేటగిరీ 3లో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గాలి నాణ్యత మెరుగుదల, రహదారి దుమ్ము నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపుదల, ప్రజల్లో అవగాహన తదితర అంశాలపై పట్టణ స్థాయిలో చేపట్టిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. జంక్షన్ల అభివృద్ధి, ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, బ్లాక్‌ ప్లాంటేషన్‌, ట్రాఫిక్‌ కారిడార్లలో పచ్చదనం పెంపు, మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ ప్లాంట్‌ లాంటి వాటిలో మెరుగైనవిగా గుర్తించారు. దాంతో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించడంతో పాటు రూ.20 లక్షల నగదు బహుమతి సాధించింది. సోమవారం న్యూ ఢిల్లీలోని ఇందిరా పర్యావరణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ ప్రకాశ్‌ శ్రీవాస్తవ, ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌ చైర్‌పర్సన్‌ రాజేష్‌వర్మ చేతుల మీదుగా నీలగిరి కార్పొరేషన్‌ మేయర్‌ బుర్రి చైతన్య, కార్పొరేషన్‌ కమిషనర్‌ బి.వంశీకృష్ణ, 16వ డివిజన్‌ కార్పొరేటర్‌ పెరిక స్వాతి అవార్డు, రూ.20 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా నగర మేయర్‌ బుర్రి చైతన్య మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో అన్ని డివిజన్లలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి, రాష్ట్రంలోనే నీలగిరి కార్పొరేషన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ అవార్డుతో నగరం మరో కీలక మైలు రాయిగా నిలిచిందని కమిషనర్‌ వంశీకృష్ణ పేర్కొన్నారు. నీలగిరి మున్సిపల్‌ చైర్మన్‌గా బుర్రి శ్రీనివాస్‌రెడ్డి ఉన్న సమయంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రూ.50 లక్షల నగదు బహుమతి, ఆయన సతీమణి బుర్రి చైతన్య మేయర్‌గా ఉన్న సమయంలో వరుసగా రెండవసారి నగదు బహుమతి దక్కించుకోవడం విశేషం.

ఫ స్వచ్ఛవాయు సర్వేక్షణ్‌లో 2వ ర్యాంకు

ఫ రూ.20 లక్షల నగదు బహుమతి అందుకున్న మేయర్‌ బుర్రి చైతన్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement