హామీల అమలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

Sep 8 2026 1:59 AM | Updated on Sep 8 2026 1:59 AM

నల్లగొండ టూటౌన్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంతో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్‌ బండ నరేందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ వెయ్యి రోజుల విఫల పాలనపై 6వ రోజు సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన ముగిసినప్పటికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. అసెంబ్లీ ఎదుట ఎమ్మెల్యేలు హరీష్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్‌, చీర పంకజ్‌యాదవ్‌, నిరంజన్‌వలి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మైనం శ్రీనివాస్‌, జమాల్‌ఖాద్రీ, బోనగిరి దేవేందర్‌, మారగోని గణేష్‌, బాణావత్‌ దీప్లా, రాజశేఖర్‌, దొడ్డి రమేష్‌, రావుల శ్రీనివాస్‌రెడ్డి, పెరిక కరణ్‌జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement