కనగల్ : మండలంలోని దర్వేశిపురం(పర్వతగిరి) శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు ఆదివారం గాజులమ్మ తల్లిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్‌కుమారాచార్యులు, గాదె ఉమామహేశ్వర్ రావు అమ్మవారికి విశేషాలంకరణలు చేసి నాగహారతి ఇచ్చి పూజలు జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కుంకుమ అభిషేక పూజలు జరిపించి బోన నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ అంబటి నాగిరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు కూసం ఉపేందర్‌రెడ్డి, కట్ట రాజయ్య, నాగరాజు, సిబ్బంది సీహెచ్.శ్రీకర్, రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


