ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇవీ..
సీఎం పర్యటన సైడ్ లైట్స్
రూ.344.92 కోట్లు తెచ్చాం
వెయ్యి రోజుల్లో అనేక పథకాలు
నకిరేకల్ : ‘వెయ్యి రోజుల పాలనలో తాము ప్రవేశపెట్టిన పథకాలు ఎంత గొప్పవో.. ఈ మైదానంలో జనాన్ని చూస్తే తెలుస్తోంది. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగితే ఎలా ఉంటుందో.. నకిరేకల్ ఇప్పుడు అలా ఉంది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఖిల్లా.. నకిరేకల్ గడ్డ కాంగ్రెస్ అడ్డాగా నేడు ఈ సభతో ప్రతిపక్షాలకు చెంపపెట్టులా తేటతెల్లమైంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నకిరేకల్‌లో శనివారం వంద పడకల ఆస్పత్రి భవనం ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మినీ స్టేడియంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను పోల్చి చూడండి. మా ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ఈ సభకు వచ్చిన జనవాహినే సమాధానమన్నారు. ప్రజల దీవెనతో మా ప్రభుత్వం రెండుసార్లు అధికారంలో ఉండబోతుందని ధీమా వ్యకం చేశారు. పండుగ రోజు గంగిరెద్దు మాదిరిగా బీఆర్‌ఎస్ నాయకులు తీరు ఉందన్నారు.
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
నకిరేకల్‌లో శనివారం నిర్వహించిన ప్రజా వికాస సభ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహం నింపింది. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం 3గంటల లోపే మినీస్టేడియం జనంతో నిండిపోయింది. సీఎం వచ్చే సమయానికి జనాలతో కిక్కిరిసిపోయింది. వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఓపెన్ టాప్ జీప్‌లో సభావేదిక వరకు వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి వీవీఎం పాఠశాలలోని హెలిపాడ్ వద్ద దిగి అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా 100 పడకల ఆస్పత్రి సముదాయానికి చేరుకున్నారు. నూతన భవనాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరు లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో వివిధ విభాగాలను సందర్శించి డాక్టర్లతో మాట్లాడారు. ఆస్పత్రి నుంచి నుంచి ఓపెన్ టాప్ జీప్‌పై కళాకారుల ప్రదర్శనలతో పక్కనే మినీ స్టేడియంలోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభా వేదిక పక్కన ఏర్పాటుచేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సభలో సీఎం ప్రసంగానికి ముందు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్, మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్‌కుమార్ మాట్లాడారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, బీర్ల అయిలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, జైవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, డెయిరీ డెలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్, రాష్ట్ర నాయకులు పటేల్ రమేష్‌రెడ్డి, సర్వోత్తంరెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, పూజర్ల శంభయ్య, కొండేటి మల్లయ్య, చనగాని దయాకర్, చామల శ్రీనివాస్, నకిరేకంటి ఏసుపాదం, నకిరేకల్, చిట్యాల మార్కెట్ చైర్‌పర్సన్లు గుత్తా మంజుల, నర్రా వినోద, చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత, చౌగోని రజితాశ్రీనివాస్‌గౌడ్, నాగులంచ వేంకటేశ్వరరావు, గాజుల సుకన్య, గాదగోని కొండయ్య, లింగాల వెంకన్న, వలిశెట్టి స్వప్న, సుంకరబోయిన వెంకన్న, ఎడ్ల ప్రవీణ్, గాయం శ్యాసుందర్‌రెడ్డి, జడల చినమల్లయ్య, ఎద్దులపూరి కృష్ణ పాల్గొన్నారు.
ఫ రూ.32 కోట్లతో నిర్మించిన వంద పడకల ఆస్పత్రి భవనానికి ప్రారంభోత్సవం చేశారు.
ఫ నకిరేకల్‌లో రూ.9.85 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనానికి, నకిరేకల్ మండలం కడపర్తిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడిన్షియల్ స్కూల్ భవనాలకు.
ఫ రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో రూ.3.62 కోట్లతో, కేతేపల్లి మండలం గుడివాడలో రూ.2.74 కోట్లతో నిర్మించనున్న సబ్‌స్టేషన్లకు.
ఫ నకిరేకల్‌లో రూ.20 కోట్లతో ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు శంకుస్థాపన
ఫ నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో రూ.45.60 కోట్లతో రహదారుల విస్తరణ
ఫ నకిరేకల్‌లో రూ.1.10 కోట్లతో ఎకై ్సజ్ శాఖ భవనానికి శంకుస్థాపన
ఫ రూ.6.25 కోట్లతో నకిరేకల్, రూ.6.25 కోట్లతో చిట్యాల మున్సిపాలిటీ భవన నిర్మాణాలకు.
ఫ రూ.17.5 కోట్లతో నకిరేకల్‌లో ప్రధాన రహదారి విస్తరణ పనులకు.
ఫ మేము పెట్టిన పథకాలు ఎంత గొప్పవో సభకు వచ్చిన జనాన్ని చూస్తేనే తెలుస్తుంది
ఫ మా ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ఈ జనవాహినే సమాధానం
ఫ నకిరేకల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఫ అట్టహాసంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థానలు
నకిరేకల్‌లో శనివారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన గంట ఆలస్యమైంది.
సాయంత్రం 5.40 గంటలకు ఆసుపత్రి నుంచి ఓపెన్ టాప్ జీప్‌పై కళాకరుల ప్రదర్శన నడుమ సీఎం సభావేదిక వద్దకు వచ్చారు.
సీఎం మైదానంలోకి చేరుకోగానే.. ప్రజలు పెద్ద పెట్టున హర్షదానాలతో స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి సభావేదిక ముందు ప్రజల మధ్యకు వెళ్లి సీఎం అభివాదం చేశారు.
సభలో సీఎం, మంత్రుల ప్రసంగాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు పలకగా ప్రజలు పెద్ద ఎత్తును కేరింతలు కొట్టారు.
సాయంత్రం 5.47 గంటలకు సభా స్థలానికి చేరిన సీఎం 6.34 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించి 7.12 గంటలకు ముగించారు.
సభలో.. ప్రజాగాయకుడు నల్లగొండ గద్దర్ నర్సిరెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డిపై పాడినపాటలు సభికులను ఉర్రుతలూగించాయి.
ఫ వేముల వీరేశం, ప్రభుత్వ విప్
సీఎం రేవంత్‌రెడ్డి రాకతో నకిరేకల్ నియోజకవర్గానికి రూ.344.92 కోట్ల నిధుల వచ్చాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులను సీఎంకు నివేదించానన్నారు. వాటికి కూడా నిధులు మంజురైతే నకిరేకల్ నియోజకవర్గ రూపురేఖలే మారుతాయన్నారు. సభకు ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఫ భువనగిరి ఎంపీ
చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
వెయ్యి రోజుల ప్రజా ప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ సభను చూసి ప్రతిపక్ష సన్నాసులకు దిమ్మ తిరగనుందన్నారు. గత బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో దోచుకొనుడు, దాచుకునుడు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి.. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని కోరారు.


