రాజవరం మేజర్‌ గండి పూడ్చివేత | - | Sakshi
Sakshi News home page

రాజవరం మేజర్‌ గండి పూడ్చివేత

Sep 6 2026 2:25 AM | Updated on Sep 6 2026 2:25 AM

తిరుమలగిరి(సాగర్‌) : నాగార్జునసాగర్‌ ఎడమకాలువ మొదటి మేజర్‌ రాజవరం కాలువకు అల్వాల, పంగవాడికుంట మధ్యలో పడిన గండిని అధికారులు శనివారం పూడ్చివేశారు. గండి పడిన ప్రదేశానికి వెళ్లిన అధికారులు.. గండి ప్రమాదవశాత్తు పడలేదని.. కావాలనే గండి కొట్టినట్లు నిర్ధారించారు. తాగునీటి అవసరాల కోసం వారం రోజుల నుంచి సాగర్‌ ఎడమకాల్వకు నీటిని విడుదల చేసి చెరువులను నింపుతున్నారు. అనుముల మండలంలోని పేరూరు చెరువును నింపడం కోసం ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కాల్వలకు గండి కొట్టినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేరూరు చెరువు విస్తీర్ణం పెద్దది కావడం, పూర్తిగా నిండాలంటే చాలా కాలం పడుతుందని, వీలైనంత త్వరగా నింపాలనే ఆలోచనలో గండికొట్టినట్లు తెలుస్తోంది. గండిపడిన ప్రాంతం నుంచి పొలాల మీదుగా నీరు కొత్తపల్లి వాగులో చేరుతోంది. కొత్తపల్లి వాగులోకి చేరిన నీరు పేరూరు చెరువులోకి ప్రవేశిస్తుంది. మేజర్‌ కాలువకు గండిపడిన ప్రాంతం కొత్తపల్లి వాగుకు సమీపంలోనే ఉండటంతో అధికారుల వ్యక్తం చేస్తున్న అనుమానాలకు బలం చేకూరుతోంది. గండి పడటంతో రెండు రోజుల పాటు మేజర్‌కు నీరు నిలిపివేయడంతో చెరువులు పూర్తిస్థాయిలో నిండటం అసాధ్యమని రైతులు అంటున్నారు.

ఫ రైతులే గండి పెట్టినట్లు అధికారుల అనుమానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement