కన్నతల్లిని హత్య చేసిన వ్యక్తికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

కన్నతల్లిని హత్య చేసిన వ్యక్తికి రిమాండ్‌

Sep 6 2026 2:25 AM | Updated on Sep 6 2026 2:25 AM

మఠంపల్లి: మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని రోకలిబండతో మోది హత్య చేసిన వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ చరమందరాజు వివరాలు వెల్లడించారు. మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్‌ సైదాబీ చిన్న కుమారుడు షేక్‌ సుభాని పెయింటర్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ భార్యా పిల్లలను పట్టించుకోవడం లేదు. దాంతో అతడి భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని తన తల్లిగారింటికి వెళ్లింది. దాంతో సైదాబీనే కుమారుడు సుభానికి అన్నం వండి పెడుతోంది. ఈ నెల 4న మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చిన సుభాని ఇంకా మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని అడిగాడు. తన వద్ద డబ్బలు లేవని ఆమె చెప్పడంతో గొడవపడిన సుభాని పక్కనే ఉన్న రోకలిబండతో ఆమె తలపై బలంగా మోదాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే అక్కడి నుంచి పరారైన సుభానిని ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement