ఫ ప్రతిష్టాత్మక కేఈఎం వైద్యశాలలో సీటు సాధించిన రామిశెట్టి సందీప్
కోదాడ : కోదాడకు చెందిన వైద్యుడు రామిశెట్టి సందీప్ ఆలిండియా స్థాయిలో అరుదైన ఘనత సాధించారు. ఫెలోషిప్ ఆఫ్ నేషనల్ బోర్డు వారు నిర్వహించిన న్యూరో వ్యాస్కులార్ ఇంటర్‌వెన్షన్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 8వ ర్యాంక్‌తో పూణెలోని ప్రతిష్టాత్మక కేఈఎం వైద్యశాలలో సీటు సాధించారు. ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్, ముంబైలోని తాపివాలా నేషనల్ మెడికల్ కళాశాలలో డీఎం న్యూరాలజీ పూర్తిచేసిన సందీప్ ప్రస్తుతం కోదాడలో వైద్యశాల నిర్వహిస్తున్నారు. ఆయనను పలువురు వైద్యులు అభినందించారు.


