కాంగ్రెస్‌ పాలనలో పేదలకు లబ్ధి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనలో పేదలకు లబ్ధి

Sep 5 2026 6:37 AM | Updated on Sep 5 2026 6:37 AM

నల్లగొండ : కాంగ్రెస్‌ పాలనలో పేదలకు లబ్ధి చేకూరుతోందని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సాధించిన విజయాలపై శుక్రవారం నల్లగొండలోని శివాజీనగర్‌ నుంచి క్లాక్‌ టవర్‌ వరకు వికాస యాత్ర నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. సాగు, తాగునీరు అందించేందుకు పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి కృషి చేస్తున్న రైతు బాంధవుడు సీఎం రేవంత్‌ అన్నారు. కార్యక్రమంలో నాయకులు జిల్లపల్లి పరమేష్‌, బోడ స్వామి, గోపగని మాధవి, ముంతాజ్‌ అలీ, పోసిరెడ్డి సంతోష్‌రెడ్డి, మేకల రాజేందర్‌ రెడ్డి, గోపిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement