రాజవరం మేజర్‌కు గండి | - | Sakshi
Sakshi News home page

రాజవరం మేజర్‌కు గండి

Sep 5 2026 6:37 AM | Updated on Sep 5 2026 6:37 AM

తిరుమలగిరి (సాగర్‌) : నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ మొదటి మేజర్‌ రాజవరం కాలువకు అల్వాల గ్రామ సమీపంలో శుక్రవారం భారీ గండి పడింది. దీంతో కాలువ నీరంతా వృథాగా పొలాల్లో పారుతోంది. సాగర్‌ ఆయకట్టు పరిధిలో తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు, భూగర్భ జలాలు పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల సాగర్‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసింది. సాగర్‌ జలాలు విడుదలైన నాటినుంచి రాజవరం మేజర్‌ పరిధిలోని చెరువుల్లోకి ఇప్పటివరకు సగం నీరు కూడా చేరలేదని, ఇప్పుడు గండి పడటంతో నీరంతా వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మేజర్‌కు నీటిని బంద్‌ చేశారు. వెంటరనే గండిని పూడ్చి, చెరువులు నింపాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement