నల్లగొండ టూటౌన్ : బీజేపీ నాయకులు మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయం దగ్గర నిరసన తెలిపితే మంత్రి అనుచరులు వర్షిత్‌రెడ్డి ఇంటికి వెళ్లి దాడులు చేస్తారా..? అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షిత్‌రెడ్డి ఇంటిపై, ఆయన తల్లి శ్రీదేవిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన మంత్రి కోమటిరెడ్డి దాడులను ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. దాడులు చేసినవారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలన్నారు. బీజేపీ జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ఉన్మాదం పరాకాష్టకు చేరిందని, తెలంగాణలో ఆటవిక రాజ్యం నడుస్తోందని తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, రావెళ్ల కాశమ్మ, భూపాల్‌రెడ్డి, చింతా ముత్యాల్‌రావు, నూకల వెంకట్‌నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వర్షిత్‌రెడ్డి తల్లికి పరామర్శ
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి తల్లి శ్రీదేవిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ఆస్పత్రిలో పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటన వివరాలపై ఆరా తీశారు. డీవీకే రోడ్డు, చైతన్యపురిలో ఉన్న శ్రీదేవి నివాసాన్ని సందర్శించారు. దాడి జరిగిన తీరును పరిశీలించారు.
ఫ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి


