నకిరేకల్‌ మినీ స్టేడియంలో సీఎం సభ | - | Sakshi
Sakshi News home page

నకిరేకల్‌ మినీ స్టేడియంలో సీఎం సభ

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

నకిరేకల్‌ : నకిరేకల్‌లో ఈనెల 5న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మంగళవారం పరిశీలించారు. సభా ప్రాంగణమైన పట్టణంలోని మినీ స్టేడియాన్ని సందర్శించి సభా వేదిక, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్టేడియం అంతా శుభ్రపరుస్తున్నారు. సీఎం పర్యటనలో భాగంగా నకిరేకల్‌లో రూ.32 కోట్లతో నిర్మించిన 100 పడకల వైద్యశాల భవన సముదాయాన్ని సీఎం ప్రారంభిస్తారని ఎమ్మెల్యే వీరేశం తెలిపారు. నకిరేకల్‌లో రూ.100 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌, కడపర్తిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ భవనాలకు శంకుస్థాపన చేస్తారని వివరించారు. నకిరేకల్‌లో సెంట్రల్‌ లైటింగ్‌ కోసం మరో రూ.18 కోట్లు కావాలని సీఎంను కోరామని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సీఎం సభకు లక్ష మంది తరలివస్తారని.. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వారి వెంట అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ చిట్యాల సతీష్‌కుమార్‌, సీఐ హరిబాబు, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, గాదగోని కొండయ్య, లింగాల వెంకన్న, బొజ్జ సుందర్‌, నకిరేకంటి నరేందర్‌, దాసరి వీరార్జున్‌రెడ్డి, పన్నాల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

01ఎన్‌కేఎల్‌08,09:

ఫ ఏర్పాట్లను పరిశీలించి ప్రభుత్వ విప్‌ వీరేశం, కలెక్టర్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement