నల్లగొండ టౌన్ : పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ నాగిళ్ల మురళి మాట్లాడుతూ సీపీఎస్ విధానం, ఉద్యోగుల భవిష్యత్‌కు ఇబ్బందికరంగా ఉందన్నారు. ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే పాత పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ సాధించే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బి.యాదగిరి, కృష్ణమూర్తి, జే.శేఖర్‌రెడ్డి, సైదులు, కె.రాంబాబు, యాకుబ్‌నాయక్, వెంకట్‌రామ్‌రెడ్డి, వాసుదేవరావు, చేపూరి నర్సింహాచారి, రాజు, ఆకనూరి లక్ష్మయ్య, సైదులు, కె.మనోజ్ ప్రదీప్, భాస్కర్, అజీముద్దీన్, ధరావత్ సైదులు, గోవర్ధన్‌రెడ్డి, బైరబోయిన భిక్షం, అనుగుల భిక్షమయ్య, ఉదయ్, సత్యనారాయణ, మహమూద్, రవినాయక్ విజయశాంతి, శంకర్‌రెడ్డి, సుమన్ పాల్గొన్నారు.


