వైద్య సేవలు మరింత చేరువ | - | Sakshi
Sakshi News home page

వైద్య సేవలు మరింత చేరువ

Sep 4 2026 1:48 AM | Updated on Sep 4 2026 1:48 AM

నకిరేకల్‌ : నియోజకవర్గ కేంద్రంలో రూ.32 కోట్లతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి నూతన భవన సముదాయం శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతన భవనానికి అవసరమైన యంత్ర పరికరాలు, ఫర్నిచర్‌ తరలింపు దాదాపు పూర్తయింది. ఈ అత్యాధునిక ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందనుండడంతో ఏళ్లనాటి కల సాకారం కాబోతోంది.

పీహెచ్‌సీ నుంచి వంద పడకలకు..

ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో జాతీయ రహదారి వెంట ఐదెకరాల విస్తీర్ణంలో మూడు అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మించారు. గతంలో పీహెచ్‌సీగా ఉన్న ఈ ఆస్పత్రిని 1998లో 30 పడకల కమ్యూనిటీ ఆస్పత్రిగా మార్చారు. రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స అందక ప్రాణాలు కోల్పోతుండటంతో 2022 జనవరిలో వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. నకిరేకల్‌, కట్టంగూర్‌, శాలిగౌరారం, కేతేపల్లి, తిప్పర్తి మండలాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

ప్రాణదాతగా ట్రామా కేంద్రం

హైదరాబాద్‌–విజయవాడ (65), రేణిగుంట (565), తానంచర్ల (365) జాతీయ రహదారులు నకిరేకల్‌ మీదుగా వెళుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి నకిరేకల్‌ వరకు 110 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా ట్రామా కేర్‌ సెంటర్‌ లేక క్షతగాత్రులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో నకిరేకల్‌లోని నూతన ఆస్పత్రిలో ట్రామా కేర్‌, డయాలిసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆస్పత్రి నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రూ.6.35 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తూ.. 105 పోస్టులను (వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది) మంజూరు చేసింది.

ఫ రూ.32 కోట్లతో నకిరేకల్‌లో నూతన ఏరియా ఆస్పత్రి భవనం

ఫ రేపు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

ఫ ట్రామాకేర్‌, డయాలిసిస్‌ కేంద్రాలు, 105 మంది సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement