పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలి | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలి

Sep 4 2026 1:48 AM | Updated on Sep 4 2026 1:48 AM

నల్లగొండ టూటౌన్‌ : పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవవల్లి ఉపేందర్‌ డిమాండ్‌ చేశారు. నా సంతకం.. పాత పెన్షన్‌ విధానం సాధనకే అనే పేరుతో గురువారం నల్లగొండలోని డైట్‌ కళాశాలలో సీపీఎస్‌ ఉద్యోగుల నుంచి సంతకాల సేకరణ ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కానుగల నర్సింహ, టీజీయూఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొర్ర కృష్ణకాంత్‌నాయక్‌, పీఆర్‌టీయూ నాయకులు తిరుపతి, నరేందర్‌రెడ్డి, శివ, వెంకన్న పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

తిప్పర్తి : సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజి రుణాలు సద్వినియోగం చేసుకుని మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం తిప్పర్తిలోని సంఘబంధం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మండలానికి ఒక ఆర్టీసీ బస్సును మహిళా సంఘాలకు కేటాయించామన్నారు. అనంతరం స్కూల్‌ యూనిఫాం పంపిణీలో ఉత్తమ సేవలందించిన వీఏఓలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సమద్‌, సంఘబంధం అధ్యక్షురాలు సునిత, ఏపీఎం హరి, అజిమా, సీసీలు ఎమేలియా, జ్యోతి, శ్రీనివాస్‌, జానకమ్మ, వీఏఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement