రామగిరి(నల్లగొండ): నల్లగొండ మండల పరిధిలోని అన్నెపర్తిలో గల 12వ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కమాండెంట్‌గా బి.రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది అంతా పరస్పర సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తిస్తూ బెటాలియన్‌కు పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎల్.నాగేశ్వరరావ, అసిస్టెంట్ కమాండెంట్లు నర్సింగ్ వెంకన్న, కె.మహేందర్, ఏఓ దయాకర్, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఆర్.షర్మిలాదేవి, డాక్టర్ నితిన్ గౌతమ్, ఇతర అధికారులు ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, మినిస్టీరియల్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


