నల్లగొండ: విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధనకు పట్టుదల, క్రమశిక్షణతో చదవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జి.వి.రమేష్ అన్నారు. నల్లగొండలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల బాలికల కళాశాల (కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్)లో బుధవారం జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. కళాశాలలో ప్రతిభావంతులైన అధ్యాపకులను నియమించి నాణ్యమైన విద్యనందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు మంచి గ్రంథాలను స్నేహితులుగా చేసుకోవాలనిన్నారు. విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భవాని, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా సురేష్‌కుమార్
ఫ కార్యదర్శిగా భూపాల్‌రెడ్డి
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 (ఐఎన్‌టీయూసీ) టీజీఎస్‌పీడీసీఎల్ కంపెనీ కార్యవర్గ ఎన్నికలు బుధవారం సంగారెడ్డిలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాకు చెందిన ఎం.సురేష్ కుమార్ రెండోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే కార్యదర్శిగా జిల్లాకు చెందిన మరొకరు కె.భూపాల్‌రెడ్డి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రమశక్తి అవార్డు గ్రహీత సురేష్‌కుమార్ రెండోసారి కంపెనీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజినల్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. నూతన కార్యవర్గానికి నల్లగొండ డివిజన్ నాయకులు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ఎంజీయూలో ‘తీజ్’
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) లో బుధవారం గిరిజన విద్యార్థుల ఆధ్వర్యంలో తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి గోధుమ బుట్టలు ఎత్తుకుని పాటలు పాడుతూ నృత్యం చేసి ఉత్సాహంగా గడిపారు. అనంతరం గోధుమ బుట్టలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ గిరిజన విద్యార్థులు సతీష్, ఆకాశ్, దేవదాస్, యువతులు పాల్గొన్నారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
నల్లగొండ టూటౌన్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేసే ట్రాక్టర్ డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి.సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ ట్రాక్టర్ డ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్‌లో 115 మంది ట్రాక్టర్, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. వీరిలో డ్రైవర్లను సెమీ స్కిల్డ్‌గా గుర్తించి 48 మందికి రూ. 20,500 ఇస్తున్నారని, మిగిలిన 67 మందికి కూడా అదే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండో పీఆర్సీ అమలు చేసి, చివరి గ్రేడ్ వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించాలని కోరారు. ఈ సమావేశంలో మోటార్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకుడు లకపాక రాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చింతకాయల సంతోష్, నాయకులు చిక్కుల రాములు, జక్కల నరసింహ, లక్ష్మణ్, నాగరాజు, సైదులు తదితరులు పాల్గొన్నారు.


