ఉద్యోగ సంఘాల ఉద్యమబాట | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సంఘాల ఉద్యమబాట

Aug 27 2026 1:42 AM | Updated on Aug 27 2026 1:42 AM

ప్రధాన డిమాండ్లు ఇవే..

నల్లగొండ టౌన్‌ : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలనే డిమాండ్‌తో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ (టీజీఈజేఏసీ) ఉద్యమబాట పట్టింది. ఉద్యోగుల, ఉపాధ్యాయులు, పెన్సనర్ల హక్కుల సాధనకు ఐక్య పోరాటాల సిద్ధమైంది. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ మానిఫెస్టోలో పెటిన హామీలను కూడా అమలు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్‌ చేస్తోంది. తమ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు దశల వారీగా ఆందోళనలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది.

నేడు ఉదయం 11 గంటలకు..

డిమాండ్ల సాధన కోసం జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 27 గురువారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున మహాధర్నాను నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ధర్నాను నిర్వహించేందుకు జేఏసీ ఏర్పాట్లు చేసింది. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు, గెజిటెడ్‌ ఉద్యోగులు, ఉపాధాయ్యకులు, పెన్షనర్లు ధర్నాలో పాల్గొననున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు విధులకు హాజరుకానున్నారు. సెప్టెంబర్‌1న పెన్షన్‌ విద్రోహదినంగా ప్రకటించింది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు. అదే విధంగా సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు, గెజిటెడ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాకులు, పెన్షనర్లు తరలివెళ్లనున్నారు.

నేడు కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా

ఫ వచ్చే నెల 10వ తేదీ వరకు

దశల వారీగా ఆందోళనలు

ఫ సిద్ధమైన ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు

వచ్చే నెల 30లోపు రెండో పీఆర్సీ నివేదకను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలి.

పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలి.

ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి.

పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్‌ కోసం నెలకు రూ.రెండు వేల కోట్లు విడుదల చేయాలి.

ఓపీఎస్‌ విధానాన్ని అమలు చేసి సీపీఎస్‌ను రద్దు చేయాలి.

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉంటున్న సమస్యలను పరిష్కరించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement