ఎస్పీకి కొండమల్లేపల్లి వాసుల కృతజ్ఞతలు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీకి కొండమల్లేపల్లి వాసుల కృతజ్ఞతలు

Aug 22 2026 1:35 AM | Updated on Aug 22 2026 1:35 AM

కొండమల్లేపల్లి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్‌ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి హత్య కేసును చేధించిన జిల్లా పోలీసులకు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, కాలనీవాసులు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం పలువురు నల్లగొండలో ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని, పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేసి భరోసా, నమ్మకాన్ని కలిగించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసులో చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేసి దర్యాప్తు పూర్తిచేసి న్యాయస్థానంలో త్వరితగతిన చార్జిషీట్‌ దాఖలు చేస్తామని వారితో చెప్పారు.

అభ్యసనపై ప్రత్యేక

శ్రద్ధ వహించాలి

కట్టంగూర్‌ : ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యసనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ సుశీందర్‌రావు అన్నారు. శుక్రవారం కట్టంగూర్‌లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, పరిసరాలను, మధ్యాహ్న భోజనాన్ని, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థుల తరగతి స్థాయికి అనుగుణంగా కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ఉపధ్యాయులు కృషి చేయాలన్నారు. గుణాత్మక విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆయన వెంకట పాఠశాల ఎస్‌ఓ నీలాంబరి ఉన్నారు.

ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ కానిస్టేబుల్స్‌ కార్యవర్గం

నల్లగొండ టౌన్‌ : జిల్లా ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ హెడ్‌ కానిస్టేబుల్స్‌, కానిస్టేబుల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా గోపీనాథ్‌రెడ్డి, కోశాధికారిగా నవ్య, అసోసియేట్‌ అధ్యక్షుడిగా వి.నరసింహారావు ఉపాధ్యక్షుడిగా కె.తిరుమలేష్‌, ప్రచార కార్యదర్శిగా డి.భాస్కర్‌, జాయింట్‌ సెక్రటరీగా మంజులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీకి నియామక పత్రాలను అందజేశారు.

బీసీఐ చైర్మన్‌

రాజీనామా చేయాలి

రామగిరి(నల్లగొండ) : బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) చైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) నల్లగొండ జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద ఐలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ, మనన్‌ కుమార్‌ మిశ్రా 14 సంవత్సరాలకు పైగా బీసీఐ చైర్మన్‌గా కొనసాగుతూ, అధికారాన్ని వ్యక్తిగతంగా కేంద్రీకరించడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షుడు పందెనపల్లి బ్రహ్మచారి, నాయకులు డి.నర్సాజి, భీమగాని గణేష్‌, ఎన్‌.రాములు, పి.శేఖర్‌, దుర్గాప్రసాద్‌, మురళీకృష్ణ, నాగరాజు, స్వామినాథ్‌, సతీష్‌, నితీష్‌, రతన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement