టీచర్లకు నోటీసులు | - | Sakshi
Sakshi News home page

టీచర్లకు నోటీసులు

Aug 22 2026 1:35 AM | Updated on Aug 22 2026 1:35 AM

నల్లగొండ : పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చేపట్టిన తాత్కాలిక సర్దుబాటు ప్రక్రియలో కొందరు ఉపాధ్యాయులు విధుల్లో చేరకపోవడంపై జిల్లా విద్యాశాఖ కఠినంగా వ్యవహరించింది. కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరని 130 మంది ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కేటాయించిన చోట విధుల్లో ఎందుకు చేరలేదో మూడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

167 మందికి సర్దుబాటు ఉత్తర్వులు..

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అవసరమున్న పాఠశాలలకు తాత్కాలికంగా సర్దుబాటు చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి జూలై 22న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 167 మంది ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లను వివిధ పాఠశాలలకు కేటాయించారు. వారిలో ఇప్పటివరకు 37 మంది ఉపాధ్యాయులు మాత్రమే తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరారు. మరో 130 మంది చేరలేదు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా విద్యాశాఖ అధికారి శుక్రవారం సంబంధిత ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సీసీఏ నిబంధనల ప్రకారం కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో ఎందుకు చేరలేదో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. విధుల్లో చేరకపోవడానికి గల కారణాలను సమర్థించే ఆధారాలను కూడా వివరణతోపాటు సమర్పించాలని ఆదేశించారు.

సర్దుబాటు చేసినా..

ఆయా పాఠశాలల్లో చేరని

ఉపాధ్యాయులు

167 మందికి ఆర్డర్లు..

విధుల్లో చేరింది 37 మందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement