ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తోంది | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తోంది

Aug 22 2026 1:35 AM | Updated on Aug 22 2026 1:35 AM

పెద్దఅడిశర్లపల్లి : సాగునీరు విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తోందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. శుక్రవారం పెద్దఅడిశర్లపల్లి మండలంలోని ఘనపురం స్టేజీ సమీపంలో ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటరీ గేట్‌ వద్ద గల జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్‌కు నీరు రాకుండా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా భారీగా నీటిని తరలిస్తోందన్నారు. సాగర్‌ నుంచి నీటిని విడుదల చేసి కుంటలు, చెరువులు నింపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కేతావత్‌ బిల్యానాయక్‌, మండల అధ్యక్షుడు వల్లపురెడ్డి, మాధవరావు, సర్పంచ్‌లు రాజశేఖర్‌రెడ్డి, శ్రీను, నగేష్‌, కిషన్‌, అర్వపల్లి నర్సింహ, యాదగిరి, పరమేశ్‌, నరేందర్‌నాయక్‌, సుధాకర్‌గౌడ్‌, శ్రీనునాయక్‌, దామోదర్‌, లోకేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement