‘సర్’ ముసాయిదా జాబితాలో తగ్గిన 1,58,635 ఓట్లు
నియోజకవర్గాల వారీగా తగ్గిన ఓట్లు..
నియోజకవర్గం గతంలోఓట్లు ప్రస్తుత ఓట్లు తగ్గినవి
దేవరకొండ 2,69,098 2,32,283 36,815
నాగార్జునసాగర్ 2,34,722 2,13,408 21,314
మిర్యాలగూడ 2,40,574 2,09,162 31,412
నల్లగొండ 2,49,571 2,17,681 31,890
మునుగోడు 2,63,757 2,46,722 17,035
నకిరేకల్ 2,58,531 2,38,362 20,169
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాలో (సర్) భాగంగా నల్లగొండ జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. గతంలో నిర్వహించిన ఇంటింటి (హెచ్‌టూహెచ్) సర్వేకు ముందు జిల్లాలో 15,16,253 మంది ఓటర్లు ఉండగా.. ముసాయిదా జాబితాలో వారి సంఖ్య 13,57,618కు (89.54 శాతం) తగ్గింది. అంటే మొత్తం 1,58,635 మంది (10.46 శాతం) ఓటర్లు తగ్గారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కూడా ఎస్‌ఐఆర్–2026 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలను ధ్రువీకరించింది. ముసాయిదా జాబితాపై ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు వినతులు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 19వ తేదీన ప్రకటించనున్నారు.
32,517 మంది మృతి..
సర్ తుది నివేదిక ప్రకారం జిల్లాలో 1,58,635 మందిని ముసాయిదా జాబితాలో చేర్చలేని ఓటర్లుగా గుర్తించారు. అందులో 32,517 మంది మరణించిన వారు ఉన్నట్లుగా తేల్చారు. మరో 1,00,144 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారిగా గుర్తించారు. ఇప్పటికే మరోచోట ఓటరుగా నమోదైన వారు 18,834 మంది ఉన్నారు. గైర్హాజరైన వారు 6,978 మంది, ఇతర కారణాలతో నమోదుకాని వారు 162 మంది ఉన్నారు. మొత్తంగా 2,34,970 మంది (17.31 శాతం) ఓటర్ల వివరాల్లో పొరపాట్లను సవరించినట్లు తేల్చారు.
మునుగోడులోనే ఎక్కువ..
ప్రస్తుత ఓటర్లు ముసాయిదా జాబితా ప్రకారం మునుగోడు నియోజకవర్గంలో 2,46,722 మంది ఓటర్లు ఉండగా జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా నిలిచింది. తర్వాత దేవరకొండలో 2,32,283, నకిరేకల్‌లో 2,38,362, నల్లగొండలో 2,17,681, నాగార్జునసాగర్‌లో 2,13,408, మిర్యాలగూడలో 2,09,162 మంది ఓటర్లు ఉన్నారు.
మహిళా ఓటర్లే అధికం
ముసాయిదా జాబితాలో 6,73,058 మంది పురుషులు, 6,84,488 మంది మహిళలు, 72 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే 11,430 మంది అధికంగా ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 542 మంది ఉన్నారు. అందులో పురుషులు 515 మంది ఉండగా, మహిళలు 27 మంది ఉన్నారు. మొత్తంగా సర్ ప్రక్రియలో 40 శాతానికి పైగా 5,48,466 మంది సొంతంగా ఎన్యుమరేషన్ చేయించుకున్నారు.
నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరణ
ముసాయిదా ఓటర్ల జాబితాపై ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు వినతులు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. కొత్తగా ఓటరుగా నమోదుకు ఫారం–6, ఓవర్సీస్ ఓటర్లకు ఫారం–6ఏ, పేరు తొలగింపుపై అభ్యంతరాలకు ఫారం–7, చిరునామా మార్పు/వివరాల సవరణకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ముసాయిదా జాబితాలో పేరు లేకపోయినా అర్హత ఉన్నవారు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.
అత్యధికంగా తగ్గింది దేవరకొండలోనే..
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శాశ్వతంగా వలస వెళ్లిపోయిన వారు, ఇతర ప్రాంతాల్లోనే తమ ఓటు హక్కును నమోదు చేసుకున్న వారు, మరణించిన వారు.. ఇలా మొత్తంగా దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు తగ్గిపోయారు. ఆ తరువాత స్థానంలో నల్లగొండ, మిర్యాలగూడలో ఎక్కువ మంది ఓటర్లు తగ్గిపోయారు.
ఫ గత జాబితాలో 15,16,253 మంది ఓటర్లు
ఫ సర్ ప్రక్రియతో 10.46 శాతం
ఓట్లు తగ్గుదల
ఫ మరణించిన, శాశ్వతంగా తరలిపోయిన, డబుల్ ఓట్లే అధికం
ఫ సెప్టెంబర్ 16 వరకు వినతులు, అభ్యంతరాల స్వీకరణ
నియోజకవర్గాల వారీగా పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల వివరాలు
నియోజకవర్గం పీఎస్ పురుషులు మహిళలు ట్రాన్స్ మొత్తం
జెండర్
దేవరకొండ 338 1,17,013 1,15,256 14 2,32,283
నాగార్జునసాగర్ 321 1,05,682 1,07,709 17 2,13,408
మిర్యాలగూడ 271 1,02,689 1,06,463 10 2,09,162
నల్లగొండ 292 1,06,313 1,11,343 25 2,17,681
మునుగోడు 327 1,23,119 1,23,602 01 2,46,722
నకిరేకల్ 312 1,18,242 1,20,115 05 2,38,362
మొత్తం 1861 6,73,058 6,84,488 72 13,57,618
సర్వీస్ ఓటర్లు
మొత్తం 542
పురుషులు 515
సీ్త్రలు 27
వివిధ కారణాలతో రద్దయిన ఓట్ల వివరాలు..
నియోజకవర్గం చనిపోయిన శాశ్వత వేరేచోట గైర్హాజరు ఇతర మొత్తం
ఓటర్లు వలస ఓటు కారణాలు
దేవరకొండ 7451 21313 7629 395 27 36815
నాగార్జునసాగర్ 3572 14612 2429 700 1 21314
మిర్యాలగూడ 5386 20254 2385 3371 16 31412
నల్లగొండ 4745 23221 2716 1208 0 31890
మునుగోడు 4842 9040 1731 1304 118 17035
నకిరేకల్ 6521 11704 1944 0 0 20169
మొత్తం 1,58,635 32,517 1,00,144 18,834 6978 162


