మర్రిగూడ : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడెం రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న నాలుగు గ్రామాలైన నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లితండాల్లో ఓటు అక్కడే ఉన్నాయి. నర్సిరెడ్డిగూడెంలో గతంలో 840 ఓట్లు ఉండగా.. ప్రస్తుతం 792 ఓట్లు, వెంకేపల్లి, వెంకేపల్లితండాలో 879 ఓట్లకుగాను 831, చర్లగూడెంలో 515ఓట్లకు గాను 457 ఓట్లు ఉన్నాయి. ఇక, నాంపల్లి మండలంలోని లక్ష్మణాపురం, లక్ష్మణాపురం తండాలో గతంలో 749 ఓట్లు ఉండగా.. ఇప్పుడు 699 ఉన్నాయి. మర్రిగూడ మండలం నర్సిరెడ్డిగూడెం గ్రామంలో ప్రజలు ఊరును ఖాళీ చేసి సమీప గ్రామమైన శివన్నగూడెంలోనే అధిక సంఖ్యలో ఇళ్లు నిర్మించుకోని నివాసం ఉంటున్నారు. మిగతా ముంపు గ్రామాలు పాత గ్రామాల్లోనే కొనసాగుతున్నారు.
ఇజ్రాయెల్‌లో
ఉద్యోగాలకు దరఖాస్తులు
నల్లగొండ : తెలంగాణ ఓవర్‌సిస్ మ్యాన్‌పవర్ కంపెని లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ రిజిస్టర్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ పరిధిలో ఇజ్రాయెల్‌లో గృహ ఆధారిత సంరక్షకుడు, సంరక్షకురాలి ఉద్యోగాల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పన అధికారి పి.సాహితి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు, దరఖాస్తు చేసే విధానం, పూర్తి వివరాలకు 08355 24946 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
విద్యుత్ ఉద్యోగుల ధర్నా పోస్టర్ ఆవిష్కరణ
నల్లగొండ : విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్లగొండలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ల హక్కులు, బాధ్యతలు, విద్యుత్ సంస్థ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మహాధర్నాకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు నిమ్మచెట్ల వెంకటయ్య, నాగేశ్వరరావు, నిరంజన్ అలీ, రాజు, నాయక్, ఎండీ.పర్వీజ్, నాగప్రసాద్, సమ్మిరెడ్డి, రాంబాబు, కోటి, భీమార్జున్‌రెడ్డి, కమల ప్రశాంతి, సునీత పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌లో
వినతుల స్వీకరణ
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 36 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలిపారు.


