ఇళ్ల కేటాయింపుపై విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల కేటాయింపుపై విచారణ జరపాలి

Aug 18 2026 7:46 AM | Updated on Aug 18 2026 7:46 AM

నల్లగొండ : కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను కొనసాగించాలని, నల్లగొండలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్‌ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించేందుకు పోలీసులు తొలుత వారిని అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అదనపు కలెక్టర్‌ వచ్చి వినతిపత్రం స్వీకరించేందుకు ప్రయత్నించినా నాయకులు నిరాకరించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గ్రీవెన్స్‌ హాల్‌లోకి అనుమతించడంతో కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు మెమోరాండం సమర్పించారు. తర్వాత కలెక్టర్‌ ఛాంబర్‌లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్‌ కలెక్టర్‌ను కలిశారు. నల్లగొండ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, డబ్బులు తీసుకుని అనర్హులకు ఇళ్లు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నందున సమగ్ర విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రునాయక్‌, మల్లికార్జున్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్‌, బోనగిరి దేవేందర్‌, దేప వెంకట్‌రెడ్డి, ఐతగోని యాదయ్య, రావుల శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు పెరిక యాదయ్య, పేర్ల అశోక్‌, రత్నగిరి శ్రీనివాస్‌, కుందూరు ప్రవీణ్‌రెడ్డి, బాణావత్‌ దీప్లా, దొడ్డి రమేష్‌, గోపగాని స్వాతి రాజశేఖర్‌, దండంపల్లి సత్తయ్య, కందుల లక్ష్మయ్య, సుంకిరెడ్డి వెంకట్‌రెడ్డి, రంజిత్‌, శ్రీనివాస్‌, జహంగీర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement