పాలిటెక్నిక్‌ విద్యను ప్రైవేటీకరించొద్దు | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ విద్యను ప్రైవేటీకరించొద్దు

Aug 18 2026 7:46 AM | Updated on Aug 18 2026 7:46 AM

రామగిరి(నల్లగొండ) : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. సోమవారం నల్లగొండ జిల్లా పాలిటెక్నిక్‌ కళాశాల ఎదుట సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, వాటి బాధ్యతలను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. జీఓ నంబర్‌ 97/2026లో పాలిటెక్నిక్‌ విద్యకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆనంద్‌ మహేంద్రా చైర్మన్‌గా పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యం మోడల్‌లో నడుస్తున్న యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్శిటీలో పాలిటెక్నిక్‌ కళాశాలలను విలీనం చేస్తే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్‌ విద్యను ప్రైవేటీకరించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంఏ.సైఫ్‌, మారుపాక కిరణ్‌, ఆదిల్‌, నందివర్ధన్‌ రాజు, గౌతమ్‌, శివాత్మిక, జయప్రకాష్‌, సాయి, సౌమ్య, అక్షయ, కావ్య, బన్ని, సహస్ర, యశస్వి తదితరులు పాల్గొన్నారు.

ఫ నల్లగొండలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement