రామగిరి (నల్లగొండ) : కూరెళ్ల శ్రీనివాస్ ఉపాధ్యాయ వృత్తికి, తన కళాత్మకతను జోడిస్తూ మరింత వన్నె తెచ్చిన విశిష్ట బోధకుడని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం అధ్యక్షుడు, విద్యావేత ఎంవి.గోనారెడ్డి అన్నారు. ప్రముఖ చిత్రకారుడు, రిటైర్డ్ హెచ్‌ఎం కూరెళ్ల శ్రీనివాస్ ఉద్యోగ విరమణ అభినందన సభ నల్లగొండలోని టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కవి కృష్ణకౌండిన్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూరెళ్ల శ్రీనివాస్ ఆర్టిస్టిక్ జీవితంపై ముద్రించిన కళా శ్రీనివాసమ్ అనే పుస్తకాన్ని గోనారెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. శ్రీనివాస్ ఉపాధ్యాయ వృత్తిలో ఆదర్శంగా కొనసాగుతూనే.. సామాజిక ఇతివృత్తాల్లో కళాకారుడిగా ఆయన అందించిన సేవలు ఎనలేనివన్నారు. ఎక్కడా ఏ చిత్ర ప్రదర్శన జరిగినా కూరెళ్ల గీసిన చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటాయన్నారు. అనంతరం కూరెళ్ల శ్రీనివాస్ – శైలజ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో బెల్లి యాదయ్య, మేరెడ్డి యాదగిరిరెడ్డి, రఘువీర్‌ప్రతాప్, బైరెడ్డి కృష్ణారెడ్డి, పున్న అంజయ్య, బోధనం నర్సిరెడ్డి, భూతం ముత్యాలు, నర్రా ప్రవీణ్‌రెడ్డి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, కుకుడాల గోవర్దన్, వడ్డేపల్లి వెంకటేశం, బండారు శంకర్, పెందోట సోము, సాగర్ల సత్తయ్య, పందిరి శ్యాంసుందర్, దాసరి శ్రీరాములు, బరిగేల శ్రవణ్ కూమర్, బూరుగు గోపికృష్ణ, తరునోజు భీష్మా చారి, చంద్రశేఖర్, డాక్టర్ మహమ్మద్ అసెనా పాల్గొన్నారు.


