అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

Jul 31 2026 1:21 AM | Updated on Jul 31 2026 1:21 AM

గోరింటా పండింది

ఓబీసీ మహాసభలను జయప్రదం చేయాలి

నల్లగొండ టౌన్‌: బెంగళూరులో ఆగస్టు 7న జరగనున్న జాతీయ ఓబీసీ మహాసభలను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు కోరారు. గురువారం నల్ల గొండలో మహా సభల పోస్టర్‌ ఆవిష్కరించి మా ట్లాడారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాలన్నారు. అనంతరం మనుమ య సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చొల్లేటి రమేష్‌, గుంటోజు వెంకటాచారిని సన్మానించారు. కార్యక్రమంలో కాసోజు విశ్వనాథం, కంది సూర్యనారాయణ, నల్ల సోమ మల్లన్న, కేశబోయిన శంకర్‌, చిక్కుళ్ల రాములు, నకిరేకంటి కాశయ్య గౌడ్‌, పసుపులేటి సీతారాములు, జెల్లా ఆదినారాయణ, కె.సత్యనారాయణ, కాసోజు శంకరాచారి, జంగాచారి, శంకర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

‘సర్‌’ను పకడ్బందీగా చేపట్టాలి

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌

మిర్యాలగూడ : మూడు రోజులే గడువు ఉన్నందున ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ, నల్లగొండ పార్లమెంట్‌ ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జి బల్మూరి వెంకట్‌ పిలుపునిచ్చారు. గురువారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సర్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లడారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్నా కై లాష్‌నేత, కే.శ్రీనివాస్‌, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య, నియోజకవర్గ ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జి షబ్బీర్‌అలీ, నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.

అర్హులంతా ఓటు హక్కు పొందాలి

దేవరకొండ: అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌, పార్లమెంట్‌ ఎస్‌ఐఆర్‌ కోఆర్డినేటర్‌, ప్రభుత్వ విప్‌ బల్మూరి వెంకట్‌ అన్నారు. గురువారం దేవరకొండలోని ఎమ్మెల్యే నివాసంలో సర్‌పై డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌తో కలిసి కాంగ్రెస్‌ శ్రేణులకు నిర్వహించిన సమావేశంలో వారు మాట్ల్లాడారు. సమావేశంలో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ జమునమాధవరెడ్డి, ఎంఏ సిరాజ్‌ఖాన్‌, పున్న శైలజ వెంకటేష్‌, వెంకటయ్య, వేణుధర్‌రెడ్డి, సర్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

నల్లగొండ: భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అన్నారు. గురువారంహైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం నల్లగొండలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఈ కంట్రోల్‌ రూమ్‌లో సమాచారం అందించేందుకు ఫోన్‌ నంబర్‌ 18004251442ను అందుబాటులో ఉంచామన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌ఓఆర్‌ దశరథ, సీపీఓ శ్రీనివాస్‌ నాయక్‌, డీఏఓ వినోద్‌ కుమార్‌, ఉద్యానశాఖ అధికారి టి.శేఖర్‌ పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ పంటల సాగే మేలు

నిడమనూరు : ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో వరికి ప్రత్యామ్నాయంగా కంది, పెసర, సజ్జలు, జొన్నలు వంటి ఆరుతడి పంటల సాగు మేలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ సూచించారు. గురువారం ఆయన నిడమనూరు మండలం బంకాపురం గ్రామంలో కంది పంట సాగు పరిశీలించి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాగర్‌ ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను కలెక్టర్‌ విన్నవించారు. వెనిగండ్ల గ్రామానికి చెందిన పలువురు బాధితులు భూ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌, జిల్లా ఉద్యాన శాఖ అధికారి టి.శేఖర్‌, ఏడీఏ సరిత, వ్యవసాయాధికారి మునికృష్ణయ్య, ఏఈ కృష్ణారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ అంకతి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement