అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
సాక్షి ప్రతినిది, నల్లగొండ :
రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించింది. 2022–26 యాసంగి సీజన్‌కు సంబంధించి ఆ ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఆరు మిల్లులు బియ్యం ఇవ్వకుండా వందల కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. అధికారుల ప్రత్యక్ష తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. వారికి నోటీసులు ఇచ్చినా కూడా బియ్యాన్ని తిరిగి ఇవ్వలేదు. మిల్లులో ధాన్యం నిల్వ కూడా లేకపోవడంతో అధికారులు ఆరుగురు మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇందులో కొందరు జైలుకు కూడా వెళ్లారు. అయినా మరికొందరు మిల్లర్లు అదే బాటలో ధాన్యాన్ని పక్కదారి పట్టించారు.
పక్కదారి పట్టిన వానాకాలం ధాన్యం
వానాకాలం–2025–26 సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యం కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి పంపండం లేదు. కావాలనే మిల్లర్లు జాప్యం చేస్తుండటంతో అనుమానం వచ్చిన విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు ఇటీవల సంయుక్తంగా జిల్లాలోని మూడు రైస్ మిల్లుల్లో అకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మాత్రం ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఉండాల్సిన ధాన్యం కంటే భారీగా నిల్వలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ మూడు మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
● డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించగా రికార్డుల ప్రకారం ధాన్యం లేదు. ఉండాల్సిన ధాన్యం కంటే 4790 క్వింటాళ్ల ధాన్యం తక్కువగాా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
● కనగల్ మండలం పర్వతగిరిలోని వెంకటసాయి రైస్ మిల్లులో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 1405 క్వింటాళ్ల ధాన్యం లోటు ఉన్నట్లు బయటపడింది. దీంతో ఆ మిల్లు యజమానిపైన అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
● చింతపల్లి మండలం నర్సర్లపల్లి గ్రామంలోఉన్న వెంకటసాయి రైస్ మిల్లులో కూడా విజిలెన్స్ పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్వహించిన అకస్మిక తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఉండాల్సిన ధాన్యంతో పోల్చి చూస్తే 1,113 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మిల్లు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
ఫ ధాన్యం మింగిన వారిని జైలుకు పంపుతున్నా.. కొందరి మిల్లర్లలో కానరాని మార్పు
ఫ జిల్లాలోని మూడు మిల్లులపై క్రిమినల్ కేసులు
ఫ అక్రమాలు తేల్చిన విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు
ప్రభుత్వం సీఎంఆర్ విషయంలో కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ కొందరు రైస్ మిల్లర్ల తీరు మారడం లేదు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం ఇవ్వకుండా.. ధాన్యం పక్కదారి పట్టించి అక్రమాలకు పాల్పడుతున్నారు. కేసులు పెట్టి జైలుకు పంపినా ఇంకా కొందరు మిల్లర్లలో మార్పు రావడం లేదు. తాజాగా విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేసి మూడు మిల్లుల్లో ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేశారు.
ప్రభుత్వ ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నందున ఎప్పటికప్పుడు మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.


