సమాజంలో పోలీసుల పాత్ర కీలకం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

సమాజంలో పోలీసుల పాత్ర కీలకం : ఎస్పీ

Jul 31 2026 1:21 AM | Updated on Jul 31 2026 1:21 AM

నల్లగొండ: సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అన్నారు. నల్లగొండలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఆయన శాలువాలు కప్పి సన్మానించారు. ఆయన ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తూ సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. పదవీ విరమణ పొందిన వారిలో పోలీసు అధికారులు ఏఎస్‌ఐ ఎన్‌.ప్రభాకర్‌, ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ బి.మోహన్‌రావు, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎండి.హిదాయత్‌ అలీలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్‌, ఏఓ శివప్రసాద్‌, ఆర్‌ఐ సంతోష్‌, ఆర్‌ఎస్‌ఐ జంగయ్య, జయరాజు పాల్గొన్నారు.

నీటి సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యం

కట్టంగూర్‌ : వర్షపు నీటి ఒడిసి పట్టేలా గ్రామాల్లో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇస్తూ నాణ్యతతో చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కట్టంగూర్‌ ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి ఎంపీడీఓ, ఉపాధి హామీ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశమై మాట్లాడారు. తెలంగాణ జలసిరి జల సంచయ్‌, జన భాగీదారి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో సర్‌ ప్రక్రియ, కేజీబీవీలో మధ్యాహ్న భోజనం, మెడికల్‌ క్యాంపును పరిశీలించారు. 108 అంబులెన్స్‌లో మందులు, రికార్డులను, స్టాక్‌ రిజిస్టర్‌లను, కేసుల వివరాలను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ పుష్పలత, ఎంపీడీఓ అంజన్‌రెడ్డి, వైద్యాధికారి జమున, జిల్లా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి ప్రదీప్‌కుమార్‌, కస్తూర్బా విద్యాలయం ఎస్‌ఓ నీలాంబరి, ఎంపీఓ స్వరూపారాణి, ఏపీఓ కడెం రాంమోహన్‌, అంబులెన్స్‌ సిబ్బంది మహేష్‌, గాలిబ్‌, ఈఎంటీ శ్రీనివాస్‌, శివాని ఉన్నారు.

వీబీజీ రామ్‌జీ పనులు వేగవంతం చేయాలి

రామగిరి(నల్లగొండ): వీబీజీ రామ్‌జీ పథకం కింద చేపట్టిన ఉపాధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతం చేయాలని అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. నల్లగొండ మండలం పెద్ద సూరారంలో గురువారం ఆయన పర్యటించారు. జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. పాఠశాలలో మొక్కలు నాటా రు. వీబీజీ రామ్‌జీ పనులపై గ్రామస్తులతో చర్చించారు. ఆయన వెంట ఎంపీఓ షేక్‌ ఇస్మాయిల్‌, కార్యదర్శి అనిల్‌కుమార్‌ ఉన్నారు.

అబార్షన్‌ కిట్లు నిల్వ ఉంచిన మెడికల్‌ ఏజెన్సీ సీజ్‌

నల్లగొండ టౌన్‌: నల్లగొండలోని ప్రకాశం బజార్‌లో శ్రీలక్ష్మీ మెడికల్‌ ఏజెన్సీలో గురువారం డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా 113 అబార్షన్‌ కిట్లు నిల్వ ఉంచినందుకు అధికారులు వాటిని సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. వీటన్నింటిని పరీక్షల నిమిత్తం ఉన్నతాధికారులకు పంపినట్టు తెలి పారు. కార్యక్రమంలో ఏడీ వి.రవికుమార్‌, డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement