కేతేపల్లి : ఉమ్మడి జిల్లాలో నాగార్జునసాగర్ జలాశయం తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో వానాకాలం పంటకు నీటిని విడుదల షెడ్యూల్‌ను అధికారులు గురువారం ప్రకటించారు. ఈ నెల 16 (గురువారం) నుంచి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు నాలుగు విడతలుగా 80 రోజుల పాటు (2.819 టీఎంీసీల) నీటిని విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తం నాలుగు విడతల్లో తొలి విడత 20 రోజులు, ఆ తర్వాత మూడు విడతలు 15 రోజులు నీళ్లు ఇస్తారు. ఒక్కో విడతకు మధ్య 15 రోజుల విరామం ఇచ్చారు.
ప్రస్తుతం నీటి నిల్వ
మూసీ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 640.92 (3.098 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. మూసీ నీటితో ఉమ్మడి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 35 వేల ఆయకట్టు భూములు సాగులోకి రానున్నాయి. దీంతో పాటు ఆయకట్టు పరిధిలోని గ్రామాల్లో చెరువులు, కుంటలను నీటతో నింపనున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంటల సాగు అవసరాల కోసం కాల్వలకు విడుదల చేసిన మూసీ నీటిని రైతులు పొదుపుగా వాడుకుని చివరి ఆయకట్టుకు అందేలా చూడాలని అధికారులు సూచించారు.
ఫ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నాలుగు విడతలు
ఫ 80 రోజుల పాటు నీటి విడుదల
ఫ షెడ్యూల్ ప్రకటించిన అధికారులు


