నత్తనడకన అండర్‌పాస్‌ల నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన అండర్‌పాస్‌ల నిర్మాణం

Jan 9 2026 7:13 AM | Updated on Jan 9 2026 7:13 AM

నత్తన

నత్తనడకన అండర్‌పాస్‌ల నిర్మాణం

ఇలా చేస్తే మేలు

ఫ తూప్రాన్‌పేట నుంచి రెడ్డిబావి వరకు అన్ని జంక్షన్‌లను పోలీసులు నియంత్రణలోకి తీసుకుని ఇష్టానుసారంగా వాహనాలు హైవే పైకి వెళ్లకుండా చేస్తే వాహనాల రద్దీని నియంత్రించవచ్చు.

ఫ సర్వీస్‌ రోడ్లు, అండర్‌పాస్‌లు ఉన్న గ్రామాల్లో జంక్షన్‌లను మూసివేయాలి.

ఫ చౌటుప్పల్‌లోని తహసీల్దార్‌ కార్యాలయం ముందున్న దర్గా వద్ద రాంగ్‌రూట్‌లో వాహనాల రాకపోకలు ఆపేయాలి.

ఫ స్థానికులు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిల మీదుగా హైవే దాటేలా చూడాలి.

ఫ హైవేకు, సర్వీస్‌ రోడ్డుకు

మధ్యన బారికేడ్లు ఏర్పాటు చేయాలి.

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి మీదుగా ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి వాహనాలు బారులుదీరుతాయి. ప్రస్తుతం ఈ హైవేపై చౌటుప్పల్‌, చిట్యాల పట్టణ కేంద్రాల్లో చేపట్టిన అండర్‌పాస్‌ బ్రిడ్జిల నిర్మాణం నత్తనడకన సాగుతుండడంతో ఈ ఏడాది సమస్య మరింత జఠిలంగా మారే అవకాశాలు ఉన్నాయి.

చౌటుప్పల్‌, చిట్యాల : హైవేపై చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో గతేడాది జూలైలో అండర్‌పాస్‌ బ్రిడ్జి పనులు చేపట్టారు. వాహనాలను మళ్లించేందుకు నవోదయ టాకీస్‌ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల వరకు ఇరువైపులా సర్వీస్‌ రోడ్ల విస్తరణ పనులు మొదలుపెట్టారు. ఏడాదిన్నర అవుతున్నా 40శాతం కూడా పనులు పూర్తవ్వలేదు. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు వాహనాలను సర్వీస్‌ రోడ్ల మీదుగా మళ్లించే అవకాశాలు ఉండగా.. ఇప్పటికే సర్వీస్‌ రోడ్లు విస్తరణ కోసం చేపట్టిన తవ్వకాలతో అస్తవ్యస్తంగా ఉన్నాయి. అదే రోడ్ల మీదుగా వాహనాలను పంపిస్తే మాత్రం ట్రాఫిక్‌ జాం అయ్యే అవకాశం ఉంది.

ప్రమాదకరంగా రోడ్డు అంచులు

సర్వీస్‌ రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో హైవేకు, సర్వీస్‌ రోడ్డుకు మధ్యన ఉన్న ఇనుప గ్రిల్స్‌ను తొలగించారు. సర్వీస్‌ రోడ్డుతో పోలిస్తే హైవే ఒకటి నుంచి రెండు ఫీట్ల ఎత్తులో ఉంది. వాహనదారులు ఏమాత్రం రోడ్డు చివరకు వెళ్లినా సర్వీస్‌ రోడ్డులోకి వాహనం బోల్తా పడే అవకాశం ఉంది.

చిట్యాలలోనూ నెమ్మదిగా..

చిట్యాల పట్టణంలోనూ పాల శీతలీకరణ కేంద్రం నుంచి ఎస్‌బీఐ వరకు ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. ఇప్పటి వరకు 30 శాతం పనులు మాత్రమే జరిగాయి. అదేవిధంగా పెద్దకాపర్తి వద్ద కూడా అండర్‌ పాస్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో సర్వీస్‌ రోడ్డు గుండా వెళ్లే వాహనాదారులకు ఇబ్బందులు ఏర్పడి ట్రాఫిక్‌ జాం అవుతోంది. చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్‌ పనుల నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలను సర్వీస్‌ రోడ్డు మీదుగా విజయవాడ వైపు పంపిస్తున్నారు. దీంతో దుమ్ము, ధూళితో సర్వీస్‌ రోడ్డులోని దుకాణాదారులతో పాటు దిచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

● చిట్యాల పట్టణంలోని రైల్వే అండర్‌పాస్‌ వద్ద రోడ్డు దెబ్బతినటంతో పాటు నీరు ఉబికి వస్తుంది.

● చిట్యాల నుంచి ఆటోనగర్‌, ఉరుమడ్ల రోడ్డు నుంచి బస్టాండ్‌కు వచ్చేందుకు స్థానికులు రాంగ్‌రూట్‌లో రాకపోకలు కొనసాగిస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

● చిట్యాల మండల పరిధిలో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి పలు చోట్ల ధ్వంసమైంది.

● హైవేకి ఇరువైపులా హోటల్స్‌, దాబాలు, టిఫిన్‌ సెంటర్లు టీ పాయింట్లు ఉండగా.. అక్కడ ఆగిన వాహనదారులు ఒక్కసారిగా హైవే మీదకు వస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

● హైవేపై ఎక్కడ పడితే అక్కడ భారీ వాహనాలను నిలిపి డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటుండడంతో అజాగ్రత్తగా వచ్చే వాహనదారులు వాటిని ఢీకొంటున్నారు.

● ప్రమాదాల నివారణకు, పండుగ రద్దీని నియంత్రించేందుకు చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ప్రత్యేక పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేసినట్లు చిట్యాల ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

చిట్యాల : సర్వీస్‌ రోడ్డులో ఎదురెదురుగా వెళ్తున్న వాహనాలు

చౌటుప్పల్‌ : బస్టాండ్‌ ఎదుట ప్రమాదకరంగా హైదరాబాద్‌–విజయవాడ హైవే అంచు

చౌటుప్పల్‌ : వ్యవసాయ మార్కెట్‌ వద్ద

అసంపూర్తిగా సర్వీస్‌ రోడ్డు నిర్మాణ పనులు

ఫ విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై తరచూ ట్రాఫిక్‌ జాంతో వాహనాల బారులు

ఫ సంక్రాంతికి వెళ్లే నగరవాసులకు తప్పని తిప్పలు

నత్తనడకన అండర్‌పాస్‌ల నిర్మాణం1
1/3

నత్తనడకన అండర్‌పాస్‌ల నిర్మాణం

నత్తనడకన అండర్‌పాస్‌ల నిర్మాణం2
2/3

నత్తనడకన అండర్‌పాస్‌ల నిర్మాణం

నత్తనడకన అండర్‌పాస్‌ల నిర్మాణం3
3/3

నత్తనడకన అండర్‌పాస్‌ల నిర్మాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement