ఎనిమిది వార్డుల్లోనే డ్రెయినేజీలు
దేవరకొండ : దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు అంతర్గత రోడ్లపై పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా కేవలం 8 వార్డుల్లోనే అంతర్గత డ్రెయినేజీ నిర్మాణం చేపట్టారు. మరికొన్ని చోట్ల ఓపెన్ డ్రెయినేజీలు ఉన్నాయి. ఓపెన్ డ్రెయినేజీలు ఉన్నచోట వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరదనీటితో రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది. ప్రస్తుతం పట్టణంలోని పలు చోట్ల నూతనంగా చేపట్టిన డ్రెయినేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.


