మురుగుమయం.. దోమలకు నిలయం
హాలియా : హాలియా మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో ఓపెన్ డ్రెయినేజీలు నిండిపోయి వరదంతా కాలనీలను ముంచెత్తుతోంది. పట్టణంలోని పలు వార్డులో డ్రెయియినేజీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సిబ్బంది 15 రోజలకోసారి తొలగిస్తుండడంతో దుర్గంధంగా మారి దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. శాంతినగర్‌లో డ్రెయినేజీ కాల్వలు లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు వీధుల్లోనే పారుతోందని కాలనీ ప్రజలు వాపోతున్నారు.


