పేరుకుపోతున్న మురుగు
చండూరు : చండూరు మున్సిపాలిటీలో 10 వార్డుల్లో 7వ వార్డులోని ఒకేఒక్క కాలనీ తప్ప అంతటా 8.29 కిలోమీటర్ల ఓపెన్ డ్రెయినేజీ వ్యవస్ధ ఉంది. డ్రెయినేజీలు శ్రుభం చేసేందుకు వార్డుకు ఇద్దరు చొప్పున 20 మందిని నియమించారు. వీరికితోడు ఐదుగురు వాహన డ్రైవర్లు ఉన్నారు. అయితే సరిపడా సిబ్బంది లేక వారానికోసారి మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. అంతటా ఓపెన్ డ్రెయినేజీలు కావడంతో అందులో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాఽలు పడేస్తున్నారు. వర్షాకాలంలో డ్రెయినేజీలు నిండి మురుగునీరు రోడ్లు, వీధుల్లో పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు


