భారత ఆర్థిక వ్యవస్థను మార్చడం సవాల్‌తో కూడినది
రామగిరి(నల్లగొండ): భారత ఆర్థిక వ్యవస్థను 40 ట్రిలియన్‌ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం సవాల్‌తో కూడినదని హైదరాబాద్‌లోని ఐసీఎస్‌ఎస్‌ఆర్ అండ్ ఎస్‌ఆర్‌సీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధాకర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీలో సోషల్ సైన్స్ ఆధ్వర్యంలో ఐసీఎస్‌ఎస్‌ఆర్ అండ్ ఎస్‌ఆర్‌సీ, పీఎం ఉషా ఆర్థిక సహకారంతో ‘వికసిత్ భారత్–2047 స్ట్రాటజీస్ అండ్ ఛాలెంజెస్’ అనే అంశంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సులో వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనా వ్యాసాలు సమర్పించారు. అనంతరం సావనీర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ ప్రొఫెసర్ సీహెచ్. కృష్ణారెడ్డి, అంబేద్కర్ యూనివర్సిటీ అడిషనల్ సీఓఈ కె. కృష్ణారెడ్డి, మునుస్వామి. మల్లేశం, బట్టు కిరీటం, నర్సింగ్ కోటయ్య, వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాస్, అకాడమిక్ కో ఆర్డినేటర్ బి. నాగరాజు, జ్యోత్స్న, హబీబ్, దినేష్, అంకుష్, నాగరాజు, హస్రత్ బేగం తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
మోత్కూరు : మహారాష్ట్రలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్ గ్రామానికి చెందిన సీహెచ్. శ్రవణ్‌కుమార్, మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మనోజ్ ఎంపికయ్యారు. వరంగల్ జిల్లాలో జరిగిన 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో వారు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు షూటింగ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోత్కూరు యాదయ్య గురువారం పేర్కొన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థను మార్చడం సవాల్‌తో కూడినది
భారత ఆర్థిక వ్యవస్థను మార్చడం సవాల్‌తో కూడినది


